టిడిపి మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి, క్లస్టర్ ఇన్ ఛార్జ్ ఎల్లారెడ్డి శుక్రవారం మంత్రాలయం పుణ్యక్షేత్రంలో బెల్టు షాపుల ద్వారా జరుగుతున్న అక్రమ మద్యం, అమ్మకాలను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. రాఘవేంద్ర సర్కిల్ నుంచి శ్రీ రామ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. వారు, మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్న ప్రాంతాలను పేర్కొంటూ, ముఖ్యమంత్రి 5 లక్షల జరిమానా, కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పిన తగ్గటం లేదని పేర్కొన్నారు.