కర్నూలు జిల్లాలోని 14 మండలాల్లో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు వర్షం కురిసింది. కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరులో అత్యధికంగా 70. 8 మి. మీ వర్షపాతం నమోదైంది. కోడుమూరు, సి. బెళగల్ లో కూడా వర్షాలు కురిశాయి. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 116. 5 మి. మీ ఉండగా 97. 6 మి. మీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.