కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో కొందరు వ్యక్తులు ఇసుకను ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని గోరంట్ల గ్రామ యువ నాయకుడు మహేష్ నాయుడు, సద్దల నడిపి మధు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామ ప్రజలతో కలిసి ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేసారు. ఇసుక రవాణపై చర్యలు తీసుకోవాలన్నారు.