సి. బెళగల్ మండలం ముడుమాల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రాధాకృష్ణారెడ్డి అకస్మాత్తుగా మృతికి సోమవారం టీడీపీ నియోజకవర్గం సమన్వయకర్త ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి నివాళులర్పించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ముడుమాలకు వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు. మృతిని కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.