రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో అధికారుల వేధింపుల వలన గుండెపోటుతో మరణించిన బుక్ కీపర్ వెంకటరామిరెడ్డి భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించారు. బుగ్గన మాట్లాడుతూ మరణించిన వ్యక్తి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. మరణానికి కారణమైన అధికారులను ఎవర్ని ఆరు నూరైనా నూరు ఆరైన వదిలిపెట్టముఅన్నారు.