ఆదోని: నకిలీ ఆర్టీఓ అధికారులు అరెస్ట్
ఆర్టీఓ అధికారులమని దోపిడికి ప్రయత్నించిన ఇద్దరు ముద్దాయిలను ఆదోని 1టౌన్ సిఐ శ్రీరామ్ అరెస్ట్ చేశారు. ఈ నెల 7న ఆదోని శివారులో నాపారాయి లోడుతో వెళ్తున్న కేరళకు చెందిన వ్యక్తులను ఆపారు. తాము ఆర్టీఓ అధికారులమని, బండి రికార్డ్స్ సరిగా లేవని, అందుకు రూ. లక్ష డిమాండ్ చేశారు. అంత క్యాష్ లేదనడంతో దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు. ఇవాళ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.