ఆదోని: పాఠశాలల దగ్గర మద్యం దుకాణాలు తొలగించాలంటూ కలెక్టరేట్‌లో ఫిర్యాదు

70பார்த்தது
ఆదోని: పాఠశాలల దగ్గర మద్యం దుకాణాలు తొలగించాలంటూ కలెక్టరేట్‌లో ఫిర్యాదు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో దేవాలయాలు, పాఠశాలల సమీపంలో టెండర్ విధానంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలపై జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. పాఠశాలలకు సమీపంలో ఉండటంతో విద్యార్థినులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி