డిప్యూటీ సీఎం పవన్ ను విమర్శించే అర్హత వైసీపీ నేతలకు లేదని జనసేన పార్టీ తాలూకా నాయకులు నాగరాజు తెలిపారు. శనివారం ఎమ్మిగనూరు పట్టణంలోని జనసేన పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్ జగన్ కు మతి భ్రమించిందని ఆరోపించారు. వైసీపీ@వైచీపి పేటీఎం నేతలు కనీసం ఎన్డీఏ కూటమినైనా, డిప్యూటీ సీఎం పవన్ నైనా విమర్శించే నైతికతను కోల్పోయారని పేర్కొన్నారు.