ప్రముఖ శైవక్షేత్రం మహానందిలో కార్తీకమాస ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. పూజల్లో భాగంగా ఈవో శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, ప్రధాన అర్చకులు అర్జున శర్మ ద్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ వరుణ పూజ చేసి అనంతరం పండితులు ధ్వజస్తంభం పైన ప్రత్యేక ఇత్తడి పాత్రలో ఆకాశదీపం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసమన్నారు.