పత్తికొండ పట్టణంలోని చెరువు కొండపై వెలసిన శ్రీ భంభం స్వామి వారి ఉరుసు మహోత్సవం సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు, దర్గా నిర్వాహకులు సోమవారం ఉదయం స్వామివారి సన్నిధిలో గంధం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మే 16వ తేదీన ఉరుసు మహోత్సవం అదే రోజు సాయంత్రం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, 17 న జియారత్ ఫాతిహాలు ఉంటాయని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో దర్గా నిర్వాహకులు ఖాసిం వలి, హసన్ పటేల్, ఫక్రుద్దీన్, గారింటి మాబు, నూర్ భాషా తదితరులు పాల్గొన్నారు.