ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు కట్టించి ఇవ్వాలని తుగ్గలి సీపీఐ కార్యవర్గ సభ్యుడు సుల్తాన్, కార్మిక సంఘం నాయకులు నాగరాజు డిమాండ్ చేశారు. సోమవారం తుగ్గలి మండలం చెన్నంపల్లి, బొందిమడుగుల, కడుముకుంట్ల గ్రామాల్లో సచివాలయాల వద్ద ధర్నా నిర్వహించి, కార్యదర్శులకు వినతిపత్రాలను అందజేశారు. ఇప్పటికే ఇంటి స్థలం ఉన్నవారికి రూ. 5 లక్షలు మంజూరు చేస్తే ఇళ్లు నిర్మించుకుంటారన్నారు.