కృష్ణగిరి మండలంలోని అన్ని గ్రామాల్లో 21వ అఖిల భారత పశుగణన సర్వేకు ప్రజలందరూ సహకరించాలని పశువైద్యాధికారులు నవీన్, రమేష్ కోరారు. ఆదివారం ఆయన కృష్ణగిరి, కంబాలపాడు తదితర గ్రామాల్లో జరుగుతున్న పశుగణనను పరిశీలించారు. పలు గృహాలను సందర్శించి పశువుల వివరాలను నమోదు చేయించారు. పశుగణన చేపట్టడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని, సర్వేకు సహకరించాలని పడి రైతులకు చెప్పారు.