రైతుల తమ పండించిన పంటకు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టి కనీసం గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే మరోపక్క పండించిన పంటను అమ్ముకోవడానికి మధ్య దళారుల చేతిలో మోసపోతున్నారని తక్షణమే మొక్కజొన్న రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు ప్రభుత్వాన్ని శనివారం డిమాండ్ చేశారు. నందికొట్కూరులో ఏపీరైతు సంఘం నాయకులు సోమన్న ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టారు.