అకాల వర్షం తో నష్టపోయిన బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకొని, తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి అన్నారు. జిల్లా కేంద్రమైన నంద్యాల లోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో సోమవారం రైతుల తో కలిసి జిల్లా కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.