చదువు లేకపోవడం వల్లే చెంచుల (గిరిజనుల)వెనుకబాటుకు కారణమని, (ఐ. టి. డి. ఏ) ను ప్రక్షాళన చేసి, చెంచులకు కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగం అయ్యేలా చేస్తామని, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శనివారం పాములపాడు మండలంలోని వేంపెంట, చెంచు కాలనీలో ఆమె పర్యటించారు. ఈ కార్యక్రమంలో టిటిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, గ్రామ సర్పంచ్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.