మహిళలు, బాలికలపై దాడులు చేస్తే చర్యలు తప్పవని ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు అన్నారు. శనివారం కోసిగి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించి, విద్యార్థినులతో సమావేశమై, ఆయన మాట్లాడుతూ బాలికలు, మహిళల పట్ల జరుగుతున్న నేరాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థినులకు వివరించారు. 18 ఏళ్లలోపు బలవంతంగా పెళ్లిలు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థినులను సూచించారు.