మంత్రాలయం మండలంలోని కగ్గల్లు గ్రామంలో రేపు గ్రామసభ నిర్వహిస్తున్నట్లు మంత్రాలయం తహశీల్దార్ రవి పేర్కొన్నారు. రీ సర్వే చేసిన భూములకు సంబంధించి సమస్యలపై గ్రామసభల్లో వినతి పత్రాలు స్వీకరించి వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల ప్రజలందరూ గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.