ఆస్పరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు సన్నీని తక్షణమే అరెస్టు చేయాలని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం ఆమె మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను , హింసను అరికట్టే చర్యల్లో పోలీసు యంత్రాంగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని ఆరోపించారు.