పెద్దకడబూరు-ఆదోని ప్రధాన రహదారి మరమ్మతులకు ఎప్పుడు మోక్షం లభిస్తుందోనని పలువురు వాపోతున్నారు. పెద్దకడబూరు నుంచి ఆదోని మండలం బైచిగేరి క్రాస్ రోడ్డు వరకు ప్రధాన రహదారి గుంతలమయంగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని, అధికారులు స్పందించి మరమ్మతులకు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.