కర్నూలు రూరల్ మండలంలోని పూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శేషఫణిరాజు రెండు నెలల నుంచి ఉపాధ్యాయుల జీతాలు వేయడం లేదని, బూకార్ సాహెబ్, నాగేంద్రుడు సోమవారం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు తెలిపారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల జీతాలు ఇప్పటికీ ఇవ్వలేదని, హెచ్ఎంను అడిగితే సరైన సమాధానం లేదని చెప్పారు. దీంతో తమ కుటుంబాలను పస్తులు ఉంచుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.