మద్యం షాపుల దరఖాస్తు గడువును ఈనెల 11వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు పొడగించినట్లు కోడుమూరు ఎక్సైజ్ సర్కిల్ సీఐ మంజుల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇప్పటి వరకు కోడుమూరు సర్కిల్ పరిధిలోని 14 షాపులకు 350 దరఖాస్తులు వచ్చాయన్నారు. వెల్దుర్తిలోని 3 షాపులకు 89 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. పెంచిన గడువును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.