కోడుమూరు: ఆధికారులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి

56பார்த்தது
కోడుమూరు: ఆధికారులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి
ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కేవీ. నారాయణ డిమాండ్ చేశారు. గురువారం గూడూరు మండలంలోని గూడూరు, చనుగొండ్ల గ్రామాల్లో సీపీఎం శాఖ మహాసభలను నిర్వహించి, మాట్లాడారు. పల్లె పండుగ అంటూ గొప్పులు చెప్పుకోకుండా సమస్యల పరిష్కారంపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలన్నారు. గూడూరులో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி