కర్నూలు మండలంలోని ఆయా గ్రామాలలో నిర్వహించే ఆధార్ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు ఎంపీడీవో రఘునాథ్ సూచించారు. ఆయన సోమవారం మాట్లాడారు. పంచాలింగాల గ్రామంలో 19, 20 తేదీల్లో, ఈ. తాండ్రపాడు, తొలశాపురం, బసవపురం గ్రామాలలో 21, 22 తేదీల్లో, నిడ్డూరు, రేమట నందనపల్లె, గార్గేయపురంలో 21, 22 తేదీల్లో గ్రామ సచివాలయాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ అసిస్టెంట్లు ఆధార్ సేవలందిస్తారని తెలిపారు.