డోన్ పట్టణంలో గత కొన్నేళ్లుగా యాచించుకుంటూ జీవనం కొనసాగించే బనగానపల్లెకి చెందిన తళ్లం ప్రసాద్ శెట్టి అనే వృద్ధుడు అనారోగ్యంతో వారం రోజుల క్రితం డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. కర్నూలుకి వెళ్లేందుకి ఇబ్బంది పడుతున్న ప్రసాద్ శెట్టి పరిస్థితిని గుర్తించారు. స్ఫూర్తి సభ్యులు ఆదివారం నాడు స్నానం చేయించి, సపర్యలు చేసి అంబులెన్సు లో కర్నూలు పెద్దాసుపత్రిలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్నారు.