రైతులకు, రైతు సేవ కేంద్రం సిబ్బందికి డోన్ ఏడిఏ పి. అశోక్ వర్ధన్ రెడ్డి సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సును ప్యాపిలి పట్టణం లోని మండల వ్యవసాయ అధికారి కార్యాలయం నందు సోమవారం నిర్వహించారు. రైతులందరు కూడా ఈ సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకొని అన్ని రకాల సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు. అలాగే రైతు సేవ కేంద్రం సిబ్బంది కూడా సమాచార హక్కు చట్టంపై పూర్తి అవగాహనతో ఉండాలని అన్నారు.