ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి సహకారంతో డోన్ ప్రభుత్వ ఐటిఐ కళాశాల యందు అక్టోబర్ 22వ తేదిన జాబ్ మేళ నిర్వహిస్తారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి సోమవారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో డికన్ ఏసి, శ్రీరామ ఫైనాన్స్, సుప్రజిత్ ఇంజనీరింగ్ కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు.