బాణాసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని చాగలమర్రి మండల ఎస్ఐ రమేష్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ దుకాణాల వద్ద నిబంధనలు పక్కాగా పాటించాలనీ సూచించారు. నివాసాలు, రద్దీ కూడళ్లలో దుకాణాల ఏర్పాటు చెస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. చాగలమర్రి గ్రామంలో పలు బాణసంచ దుకాణాల్లో లైసెన్స్ ను చెకింగ్ చేశారు. ప్రతి దుకాణం వద్ద అగ్ని నిరోధిక సిలిండర్లు , ఇసుక , నీరు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.