పనికి రాకపోతే పేమెంట్ ఎలా చేశావ్?
ఉపాధి పనికి రానివారికి పేమెంట్ ఎలా చేశావని ఆరేకల్లు ఫీల్డ్ అసిస్టెంట్ గోపాల్ను పీడీ నాసరరెడ్డి ప్రశ్నించారు. 2023 - 24 ఆర్థిక సంవత్సరం ఉపాధి పనుల సామాజిక తనిఖీ స్థానిక ఏపివో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతి బాగోతం బట్టబయలైంది. ఫీల్ట్ అసిస్టెంట్ల చేతివాటంపై పీడీ కోపోద్రిక్తులయ్యారు. ఒకటి, రెండు తప్పులను వదిలేయవచ్చని, మీ అవినీతికి అంతు లేకుండాపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.25కోట్ల వరకు ఉపాధి పనుల కోసం నిధులు ఖర్చు పెట్టామని ఏపీవో ఖాలీక్ తెలిపారు.