ఆదోని: వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
ఆదోని పట్టణం అమరావతి నగర్ లో పావని అనే వివాహిత అత్తింటి వారి వేధింపులు తాళలేక ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. మూడేళ్ల క్రితం పెద్దల సమక్షంలో శ్రీనివాస్ కు పావని రెండో భార్యగా వివాహం చేసుకుంది. అయితే భర్త, అతని కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.