పేదలకు సీఎం సహాయ నిధి వరం లాంటిదని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి అన్నారు. శనివారం ఆదోనిలో ఆయన మాట్లాడారు. దొడ్డనగేరికి చెందిన మునిస్వామికి కడుపులో అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించుకున్నాడని, ఆరోగ్యశ్రీ పథకంకు మించి, ఖర్చు కావడంతో ఎమ్మెల్యే సహాకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా, రూ. 1. 06 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ చెక్కును ఎమ్మెల్యే పార్థసారథి చేతుల మీదుగా అందజేశారు.