కౌతాళం మండలం ఆటో యూనియన్ తరపున విజయవాడ వరద బాధితులకు విరాళాల సేకరించి, రూ. 25 వేలు శుక్రవారం టీడీపీ తెలుగు రైతు జిల్లా కార్యదర్శి అల్లూరి వెంకటపతి రాజుకు అందజేశారు. ప్రతి ఒక్కరూ వరద బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు, ఆర్ఎంపీ డాక్టర్ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు డాక్టర్ రాజానంద్, గొట్టయ్య, నరసప్ప పాల్గొన్నారు.