‘నిందితులను తక్షణమే అరెస్ట్ చేయండి‘

82பார்த்தது
‘నిందితులను తక్షణమే అరెస్ట్ చేయండి‘
కల్లుకుంట గ్రామంలో దళిత మహిళను వివస్త్రను చేసి కట్టేసి కొట్టిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని దళిత కుల సంఘాల నాయకుల డిమాండ్ చేశారు. శుక్రవారం దాడి ఘటనకు సంబంధించి సీఐ మంజునాథ్, ఎస్సై నిరంజన్ ను కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. నేటి ఆధునిక యుగంలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం దౌర్భాగ్యమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో అమర నిరాహార దీక్షలకు పూనుకుంటామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி