ఎమ్. ఎస్. ఎమ్. ఈ ద్వారా క్లస్టర్లు ఏర్పాటు చేసుకుంటే 90% సబ్సిడీ వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకుని ఆటో మొబైల్ అసోసియేషన్లను క్లస్టర్లు గా ఏర్పడాలని ఎంపి కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. గత మూడు రోజులుగా విజయవాడ ఆటోనగర్ లో ఆటో మొబైల్ అసోసియేషన్లతో సమావేశం అవుతూ.. వారి సమస్యలను ఎంపి శివనాథ్ తెలుసుకున్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులతో కూడా సమావేశమయ్యారు.