పశ్చిమ నియోజకవర్గానికి వేస్ట్ ఫెలో వెలంపల్లి శ్రీనివాస్ అని ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఎద్దేవా చేశారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేసిన వెలంపల్లి శ్రీనివాస్ పశ్చిమ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడో చెప్పాలన్నారు. భవానిపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో అడ్డూరి శ్రీరామ్ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సుజనా చౌదరిని విమర్శించే అర్హత, స్థాయి శ్రీనివాస్ కు లేవన్నారు.