కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్ లో ఉన్న వ్యాపారస్తులు అంతా వరద నీటిలో మునిగిపోయారు. వారికి కమర్షియల్ ఎన్యుమరేషన్ ఆన్లైన్ చేసినారు కానీ కమర్షియల్ ఎన్యుమరేషన్ పడలేదు. ఆ విషయం మీద ఎమ్మార్వోకి, మున్సిపల్ కమిషనర్ ని చాలాసార్లు అడిగారు. వారు కూడా మాకు పైనుంచి ఆదేశాలు ఏమీ రాలేదు అని చెప్పటంతో కౌన్సిలర్ స్వయంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు.