వేదాధ్యయనం పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న పండితులకు భృతిని కనీసం రూ. 10వేలు అందించాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు శుక్రవారం డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వీరికి నిరుద్యోగ భృతి 3 వేల రూపాయలు ప్రకటించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతదేశం వేద భూమి అని అటువంటి చోట వేద విద్యను అభ్యసించిన పండితులను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.