నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజిలోని మెటలర్జీ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థులు హైదరాబాద్ కు చెందిన కాస్ టెక్’ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. మొదటి ఆరు నెలలు ఇంటర్న్ షిప్ ద్వారా తర్ఫీదు పొందుతారని యాజమాన్యం తెలిపారు. ఇంటర్న్ షిప్ సమయంలో ప్రతినెల 15, 000 స్టైఫండ్ పొందనున్నారు. ఆ తదుపరి ఉద్యోగంలో నియమిస్తారన్నారు. ఎంపికైన విద్యార్థులందరినీ డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ అభినందించారు.