తిరువూరు నియోజకవర్గం పరిధిలో గల తిరువూరు డివిజన్ ఎ. కొండూరు మండలం కంభంపాడులో రీ సర్వే జరుగుతున్న తీరును తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కే. మాధురి మంగళవారం పర్యవేక్షించారు. అక్కడ రైతులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సారంగపాణి, అధికారులు పాల్గొన్నారు.