ప్రజా నాట్య మండలి ఎన్టిఆర్ జిల్లా శిక్షణా తరగతులు తిరువూరు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. జనవరి 3, 4, 5 తేదీల్లో తిరువూరులో జరగనున్న సిపిఎం ఎన్టీఆర్ జిల్లా మహా సభల సందర్భంగా ఈ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి అప్పన్న తెలిపారు. ప్రజలపై ప్రభుత్వాలు మోపుతున్న భారాలను, పడుతున్న ఇబ్బందులను పాటలు రూపంలో ప్రజలకు వివరిస్తామని చెప్పారు.