దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన ఎంపీపీ
జి.కొండూరు మండలం, చెర్వు మాధవరం, మునగపాడు గ్రామాల్లో.. వరద ముంపునకు గురై దెబ్బతిన్న పంట పొలాలను, ఇళ్లను, రోడ్లను జి. కొండూరు మండల పరిషత్ అధ్యక్షురాలు వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. చెర్వు మాధవరంలోని జగనన్న కాలనీ ఇళ్లను, దెబ్బతిన్న ఇళ్లను ,మునగపాడులో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెర్వు మాధవరం గ్రామ పార్టీ అధ్యక్షుడు బాణావత్ యలమంద , గరికపాటి జై పాల్, కోటి, మునగపాడు గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.