ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో.. నిత్యావసర వస్తువుల కిట్ లను బుధవారం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు వరద బాధితులకు పంపిణీ చేశారు. ఇబ్రహీంపట్నంలోని గాజులపేట కాలనీలో వరద ముంపుకు గురైన 1000 కుటుంబాల వారికి బియ్యం, ఆయిల్, కందిపప్పు, చింతపండు, కారం, ఉప్పు, పసుపుతో కూడిన నిత్యావసర వస్తువుల కిట్ లను ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు దాతలతో కలిసి పంపిణీ చేసారు.