మచిలీపట్నం మెడికల్ కళాశాలకు జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య పేరు పెడతామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన పట్ల పింగళి వెంకయ్య మనుమడు, మాచర్లలో స్థిరపడిన విశ్రాంత ప్రిన్సిపాల్ జీవీఎన్ నరసింహం (స్వర్గీయ పింగళి వెంకయ్య ఏకైక కుమార్తె స్వర్గీయ ఘంటసాల సీతామహాలక్ష్మి కుమారుడు) హర్షం బుధవారం వ్యక్తం చేశారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కృషితో రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం సంతోషం కలిగించిందన్నారు.