తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదును భారీగా చేపట్టాలని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, కృష్ణా జిల్లా టిడిపి అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు పిలుపునిచ్చారు. సోమవారం మచిలీపట్నంలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ 100 రూపాయలతో సభ్యత్వ నమోదు చేయించుకుంటే రూ. 5లక్షల బీమా వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు.