మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఇక మెరుగైన సేవలు అందనున్నాయి. స్థానిక ఆసుపత్రిలో కొన్ని విభాగాల్లో పరికరాలు లేవు. ఈ క్రమంలో జిల్లా మినరల్ పౌండేషన్ ట్రస్ట్ కింద కలెక్టర్ రూ. 2కోట్లు మంజూరు చేయించారు. మొబైల్ ఎక్స్-రే, ల్యాప్రోస్కోపీ, తదితర విభాగాలకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే రోగులకు మరింత మెరుగైన సేవలు అందుతాయి.