మచిలీపట్నం: ప్రజా సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలి

65பார்த்தது
మచిలీపట్నం: ప్రజా సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలి
ప్రజా సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు పోలీసులకు సూచించారు. సోమవారం మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 42 మంది వ్యక్తులు తమ సమస్యల నిమిత్తమై ఎస్పీకి అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమస్య ఎలాంటిదైనా తన వద్దకు వచ్చి తెలియజేయవచ్చునని తెలిపారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తా అన్నారు.

தொடர்புடைய செய்தி