పమిడిముక్కల మండల పరిధిలో నిర్వహించిన జగనన్న రీ సర్వేలో జరిగిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ డి. కె. బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మచిలీపట్నంలో జరిగిన మీ కోసంలో సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ కలెక్టర్ కు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. పమిడిముక్కల మండలం గోపువానిపాలెంలోని రెవెన్యూ ఏరియాలోని సర్వే. నెం. 30, 93లోని భూములకు ఎల్. పిలు సృష్టించారని కలెక్టర్ కు వివరించారు.