మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ ఏడి కామరాజు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో సభ ఎక్కడ ఏర్పాటు చేయాలనీ అలాగే దివ్యాంగ విద్యార్థులకు ఏ విధమైన గేమ్స్ నిర్వహించాలో అనే అంశాలపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల ప్రతినిధులు పాల్గొన్నారు.