కృష్ణాజిల్లా అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని కృష్ణాజిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సోమవారం మచిలీపట్నంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోనప్పటికీ, ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు.