కుంటుపడిన రాష్ట్ర అభివృద్ధిని 130 రోజుల్లో గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. సోమవారం మచిలీపట్నం జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరము నందు కలెక్టర్ బాలాజీ అధ్యక్షతన మంత్రులు సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా అనునిత్యం పనిచేస్తున్నారన్నారు.