భారతదేశ ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొల్లు కృష్ణ అన్నారు. మంగళవారం మచిలీపట్నంలో కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 107వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లు కృష్ణ మాట్లాడుతూ స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రజలకు బ్యాంకులు జాతీయకరణ, ఎన్నో జాతీయ సంస్థలు ఏర్పాటుకు కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.